పోస్ట్‌లు

భారత తొలి స్పేస్‌ టూరిస్టు మన తెలుగువాడే

  భారత తొలి స్పేస్‌ టూరిస్టుగా మన తెలుగువాడు గుర్తింపు పొందారు.  విజయవాడలో పుట్టిన గోపీచంద్‌ తోటకూర  ఈ అరుదైన అవకాసం అందుకున్నారు. గోపీచంద్‌ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు.  రాకేశ్‌ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ రూపొందించిన న్యూషెపర్డ్‌-25 (ఎన్‌ఎస్‌-25) వ్యోమనౌకలో గోపీచంద్‌ ఈ యాత్ర పూర్తిచేశారు.  గోపీచంద్‌ పైలట్‌గానూ శిక్షణ పొందారు. వాయు మార్గంలో రోగుల అత్యవసర తరలింపు విభాగంలో సేవలు అందించారు. హాట్‌ ఎయిర్‌ బెలూన్లు, గ్లైడర్లు, సీప్లేన్లు నడిపారు. ఆయన ‘ఎంబ్రీ-రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్సిటీ’ నుంచి ఏరోనాటికల్‌ సైన్స్‌లో బీఎస్సీ పూర్తి చేశారు Forever changed. #NS25 pic.twitter.com/g0uXLabDe9 — Blue Origin (@blueorigin) May 19, 2024  
ఇటీవలి పోస్ట్‌లు