చంద్రుడు చుట్టూ ఓ రౌండ్ వేసి వద్దాం,డబ్బు రెడీ చేసుకోండి

updated: March 8, 2018 22:11 IST
చంద్రుడు చుట్టూ  ఓ రౌండ్ వేసి వద్దాం,డబ్బు   రెడీ చేసుకోండి

అవును చంద్రడు మీదకు  వెళ్ళి అక్కడ ప్లాట్ లు కొనుక్కుని సెటిల్ అవటం  వంటి విషయాలు మనం చాలా కాలంగా  జోక్స్ వేసుకుంటూంటాం. ఈ మధ్యన తెలుగులో చందమామలో  అమృతం అనే సినిమా కూడా ఈ ఐడియా మీద తీసేసారు. ఎందుకంటే మనం చంద్రుడు లేదా వేరే గ్రహాల మీదకు వెళ్లటం అనేది మనకు కలలో కూడా ఊహించం,నమ్మం.  అయితే జోక్స్ కూడా ఒక్కోసారి నిజమౌతూంటాయి. 

అమెరికాలో బ్లూ ఆరిజన్‌ అనే ఒక స్పేస్‌ కంపెనీ వారు అలాంటి ఆలోచనలను నిజం చేసే పనిలో ఉన్నారు. ఈ కంపెనీ వచ్చే అతి త్వరలో అంతరిక్షంలోని యాత్రీకులను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోందని సదరు సంస్థ సీఈఓ బాబ్‌ స్మిత్‌  ఆ మధ్యన ప్రకటన చేసారు. తమ సంస్థ ప్రతిరోజూ యాత్రికులను అంతరిక్షంలోకి తీసుకెళ్లి.. అక్కడి వింతలు.. విచిత్రాలను చూపిం‍చి తీరిగి తీసుకొస్తామని నేషనల్‌ స్పేస్‌ కౌన్సెల్‌కు బ్లూ ఆరిజన్‌ తెలిపింది. ఇందుకు వ్యోమగాములను ఉపయోగించడం లేదని సంస్థ సీఈఓ స్మిత్‌ తెలిపి ఆశ్చర్యపరిచారు.

ఇక వారి టార్గెట్ ప్రకారం.... 2019 చివరాఖరి నాటికి యాత్రికులను అంతరిక్షంలోకి తీసుకెళతామని బ్లూ ఆరిజన్‌ తెలిపింది. అలాగే ప్రతి రోజూ యాత్రికులను అంతరిక్షంలోకి తీసుకెళ్లేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామంది.  ఇక పైకి వెళ్లాక ఏం చేస్తారనే దాని ప్యాకేజ్ లో ..చంద్రుడి చుట్టూ ప్రదక్షిణగా యాత్రకు శ్రీకారం అని చెప్పింది.  అసలు అంతరిక్ష యాత్ర అనేది గవర్నమెంట్ పరిశోదనలకు సంభందించిన వ్యవహారం కాదని, కేవలం వ్యాపార దృక్ఫథమేనన్న బ్లూ ఆరిజన్‌ స్పష్టం చేసింది. 

ఇక అక్కడ అంతరిక్షంలో ఎంతకాలం ఉంటాము అంటారా.. చంద్రుడితో పాటు.. అంతరిక్షంలో ఒక రెండు రోజులు ఉండేలా ఏర్పాట్లు చేస్తామంటోంది. మరి మేము రెడీ.. టిక్కెట్‌ ధర ఎంత అంటారా.. బాగా  అధికంగా ఉంటుందని చెబుతున్న ఈ సంస్ద..ఇంకా  నిర్దిష్టమైన రేటును ప్రకటించలేదు. మరి డబ్బులు రెడీ చేసుకోండి.. చంద్రుడు చుట్టూ ఓ రౌండ్ వేసి వద్దాం

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments